యర్రగొండపాలెం: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వివరాలను వెల్లడించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వివరాలను కలెక్టర్ విజయ సునీత శనివారం వెల్లడించారు. జిల్లాలో 9,08,772 మంది ఓటర్లు ఉండగా 4,57,122 డిజిటలైజేషన్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎర్రగొండపాలెం 51.31, మార్కాపురం 52.51, గిద్దలూరు 51.15, కనిగిరి 46.62 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం మీద ఇప్పటివరకు 50.30 శాతం పూర్తయిందన్నారు.