కళ్యాణదుర్గం: ముద్ది నాయన పల్లి కి చెందిన ప్రీతి అనే యువతి కేంద్ర రెవెన్యూ శాఖలో జీఎస్టీ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపిక
కళ్యాణదుర్గం మండలం ముద్దినాయన పల్లి గ్రామానికి చెందిన ప్రీతి అనే యువతి కేంద్ర రెవెన్యూ శాఖలో జీఎస్టీ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఎస్ ఎస్ సీ సీ జీ ఎల్ పరీక్షా ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచింది. 2150 వ ర్యాంకు సాధించి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించింది. దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది పోటీ పడినప్పటికీ ప్రీతి సత్తా చాటి ఉద్యోగానికి ఎంపికైంది. ఈ క్రమంలో శుక్రవారం ప్రీతిని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అభినందించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.