గిద్దలూరు: కొమరోలు మండలం సర్వేరెడ్డిపల్లి గ్రామంలో అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త, దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సర్వేరెడ్డిపల్లి గ్రామంలో అనుమానంతో భార్య మరియు జ్యోతిని భర్త దావీదు గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి హత మార్చాడు. 20 సంవత్సరాల క్రితం ఏబీఎం పాలెం కు చెందిన దావీదుకు సర్వేరెడ్డి పల్లి గ్రామానికి చెందిన మరియు జ్యోతికి పెద్దలు వివాహం జరిపించారు. వీరికి ఒక కుమార్తె కుమారుడు కూడా ఉన్నారు. ఉదయం గొడ్డలితో వెంబడించి బహిర్ భూమికి వెళ్లిన సమయంలో జ్యోతిని గొడ్డలితో దాడి చేసి భర్త హతమార్చాడు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామకోటయ్య మీడియాకు తెలిపారు.