గిద్దలూరు: గిద్దలూరు మండలం క్రిష్టం శేట్టిపల్లి గ్రామంలో గౌరవిద్యుత్ పరికరాలను ప్రారంభించిన కలెక్టర్, మంత్రి రవికుమార్
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లె గ్రామంలో శుక్రవారం ప్రధానమంత్రి సూర్య ఘర్ కార్యక్రమంలో భాగంగా సోలార్ విద్యుత్ పరికరాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గంలో 2,410 గృహాలకు రూ.29.28 కోట్లతో సోలార్ విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు అదనంగా రాయితీలు కల్పిస్తున్నట్లు మంత్రి అన్నారు.