తాడిపత్రి: అక్రమంగా గ్యాస్ సిలిండర్లు తరలించినా, రీ ఫీలింగ్ చేసినా చర్యలు: తాడిపత్రిలో సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ మల్లేష్
తాడిపత్రి మున్సిపాలిటీ తో పాటు రూరల్ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు తరలించినా, రీ ఫిల్లింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తాడిపత్రి సివిల్ సప్లై తహశీల్దార్ మల్లేష్ హెచ్చరించారు. తాడిపత్రిలో శుక్రవారం ఆయన మాట్లాడారు. గ్యాస్ సిలిండర్లపై ప్రతిరోజు దాడులు చేస్తున్నామన్నారు. గత రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి అక్రమంగా గ్యాస్ సిలిండర్లను దాచి ఉంచినట్లు సమాచారం రావడంతో వెంటనే వెళ్లి రెడ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు. ఇకమీదట ఎవరైనా గ్యాస్ సిలిండర్లను అక్రమంగా తరలించినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.