ఉరవకొండ: ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం: ఉరవకొండలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఉరవకొండలో బుధవారం మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని నలుమూలలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రి అందజేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాల మేరకే ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.