కొండపి: ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద అపస్మాక స్థితిలో వ్యక్తి మృతి, ఎవరైనా గుర్తిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి
ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న సుమారు 50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. జీజీహెచ్ అవుటో పోస్ట్ ఏఎస్సై రవికుమార్ అందించిన సమాచారం మేరకు.. ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృతుని బంధువులు లేదా ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.