రాయదుర్గం: శ్రీ ప్రసన్న వెళ్ల స్వామి బ్రహ్మోత్సవాల్లో హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీవారు,
రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సోమవారం హనుమంత వాహనోత్సవం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన హనుమంత వాహనంపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. కోట ఏరియా, ఊరువాకాలి, తేరు బజార్, లక్ష్మీబజార్ మీదుగా ఊరేగింపు సాగింది. అడుగడుగునా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం శ్రీవారి కళ్యాణోత్సవం జరగనుందని ఈఓ తెలియజేశారు.