రాయదుర్గం: విద్యుత్ మోటార్ పంపుసెట్లను దొంగలించే ముగ్గురు దొంగలను అరెస్టు చేసిన డి.హిరేహాల్ పోలీసులు
డి.హిరేహల్ పోలీసులు విద్యుత్ మోటార్ల దొంగతనం కేసును ఛేదించారు. ముగ్గురు నిందితులు కావలి వీరేష్, జనార్దనబాబు, బోయ హరికృష్ణను అరెస్టు చేసి, రెండు పంపుసెట్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 1న నాగలాపురం సమీప పొలాల్లో రైతుల మోటార్లను దొంగిలించి మల్లికేతి చెరువు పొదల్లో దాచారు. బుధవారం బళ్లారిలో విక్రయించేందుకు మల్లికేతి క్రాస్ వద్ద ఉండగా ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు.