రాయదుర్గం: జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పట్టణంలో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాయదుర్గం MLA కాలవశ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అంతరాలు తొలగాలని ఆయన, ఆయన సతీమణి సావిత్రీబాయి పూలే చేసిన సేవలు కొనియాడారు. ఎస్సీ ఎస్టీ ల సంక్షేమంతోపాటు బిసి సబ్ ప్లాన్ అమలుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.