రాయదుర్గం: ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు వాఖ్యలపై బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు ఆగ్రహం
రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు చేసిన వాఖ్యలపై బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు తీవ్రంగా స్పందించారు. రెండు రోజుల క్రితం గుమ్మగట్ట మండలంలోని బేలోడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వెయ్యి ఓట్లు కూడా రాని వారు తనపై విమర్శలు చేస్తున్నారని వారికి బడిత పూజ చేయాలని మాట్లాడటం ఆయన అసహనానికి నిదర్శనమని వాఖ్యానించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన బడిత పూజకు తాను రెడీ అని ఎక్కడ రావాలో టైం చెప్పాలని లేదంటే వినాయక కూడలి లోకి వస్తానని సవాల్ విసిరారు. రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అంటూ సవాల్ విసిరారు.