రాయదుర్గం: వడదెబ్బతో 74 ఉడేగోళం గ్రామానికి చెందిన రైతు మృతి
పొలం పనులకు వెళ్లి ఎండవేడిమి తట్టుకోలేక బుడిమేపల్లి కొల్లప్ప(60) అనే రైతు పొలంలోనే కుప్పకూలాడు. వడదెబ్బ ప్రభావంతో అక్కడిక్కడే మృతి చెందాడు. రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామానికి చెందిన కొల్లప తన పొలంలో టమోట నారు వేయడానికి ఉదయం నుంచి భూమిని దుక్కిచేసి అదును చేశాడు. మద్యాహ్నం దప్పిక తీర్చు కునేందుకు నీటితొట్టె దగ్గరకు వెళ్లి పడిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.