మార్కాపురం: గానుగ పంటలో అసంపూర్తిగా నిలిచిన భవనంలో ప్రభుత్వ పాఠశాల, ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం గానుగుపెంట ముతరాజు కాలనీలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనంలో ప్రభుత్వ పాఠశాల జరుగుతుంది. ఇంతకుముందు చర్చిలో పాఠశాల జరుగుతుండగా గత ప్రభుత్వంలో నూతన భవనం మంజూరు అయింది. కానీ ఆ నిర్మాణం ఎన్నికల సమయానికి పూర్తి కాలేదు. దీంతో గత్యంతరం లేక ఆ భవనంలోనే పిల్లలకు చదువులు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులన్నారు. తాగడానికి నీరు మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.