గిద్దలూరు: గిద్దలూరులో పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఆదివారం ప్రతిభ పురస్కారాల కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన యాదవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. పురస్కారాలు అందించిన యాదవ సంఘాన్ని ఎమ్మెల్యే అభినందించారు.