రాయదుర్గం: మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంటే భూస్థాపితం కాకతప్పదు : BJP జిల్లా అధ్యక్షులు రాజేష్, మాజీ MLA రామచంద్రారెడ్డి
మహిళా బిల్లును అడ్డుకుంటే కాంగ్రెస్ భూ స్థాపితం కాక తప్పదని బిజెపి జిల్లా అధ్యక్షులు కొనగొండ్ల రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఆదివారం రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి రాజరాజేశ్వరి కమ్యూనిటీ హాల్ లో జరిగిన బిజెపి ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న వారు మీడియాతో మాట్లాడారు. నారీ శక్తి పేరుతో ముఖ్యమంత్రులుగా, గవర్నర్ లుగా మహిళలకు అవకాశాలు కల్పిస్తూ, వారిని ప్రోత్సాహిస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ బిజెపి అన్నారు.