యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో నేలకొరిగిన భారీ వృక్షం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో ఎర్రగొండపాలెం త్రిపురాంతకం ప్రధాన రహదారి లో భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పంచాయతీ సిబ్బంది రంగంలోకి దిగి జెసిబి తో పడిపోయిన చెట్టును పక్కకు తీశారు. గంట తర్వాత ప్రధాన రహదారిపై రాకపోకలు కొనసాగాయి.