కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న జన గణన శిక్షణను తనిఖీ చేసిన ఆర్డీఓ
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న జనగణన శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆర్డీఓ వసంత బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనగణన సర్వేకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్న వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. జనగణన సర్వే పక్కాగా చేయాలన్నారు. అనంతరం జనగణన సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు సెన్సస్ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ పాల్గొన్నారు.