రాయదుర్గం: పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రెండవ రోజూ కొనసాగిన డాక్యుమెంట్ రైటర్ల రిలే దీక్షలు
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంతో దస్తావేజు లేఖరుల వ్యవస్థను నిర్వీర్యం చేయడం సరికాదని డాక్యుమెంట్ రైటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష గురువారంతో రెండో రోజుకు చేరింది. జీవో నెంబర్ 396కు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా పెన్ డౌన్ చేసి, నల్ల బ్యాడ్జీలతో దీక్ష చేపట్టారు. జీవో వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని, ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న తమ జీవనోపాధి దెబ్బతింటుందని అసోషియేషన్ నాయకులు పత్రాల నాగరాజు, దబ్బడి మంజునాథ , రామాంజనేయులు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్