దర్శి: దర్శి సాయి నగర్ లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన డి.ఎస్.పి బాలమురళీకృష్ణ
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని సాయి నగర్ లో డీఎస్పీ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రతి ఇంటిని గాలించారు. మత్తు పదార్థాలు గంజాయిని లక్ష్యంగా చేసుకొని గాలింపు చేపట్టినట్లు డిఎస్పి తెలిపారు. సరైన ధ్రువపత్రాలు లేని 38 బైకులు రెండు ఆటోలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు అన్నారు. ధ్రువీకరణ పత్రాలు చూపించి తీసుకెళ్లాలని వాహన యజమానులకు సూచించినట్లు తెలిపారు.