యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామంలో త్రాచు పాము కలకలం పట్టుకున్న స్నేక్ క్యాచర్ మల్లికార్జున
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామంలో త్రాచు పాము కలకలం రేపింది. అంజిరెడ్డి నివాస ప్రాంతంలో పాము కనపడడంతో వెంటనే ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ మల్లికార్జున కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మల్లికార్జున సంఘటన ప్రాంతానికి చేరుకొని త్రాచుపామును పట్టుకున్నారు. అత్యంత విషపూరితమైన పాము అని అడవి ప్రాంతంలో వదిలేయడం జరుగుతుందన్నారు దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.