దర్శి: జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన టిడిపి ఇన్చార్జి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి టిడిపి కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసి అంటరానితనం నిర్మూలనకు తుది శ్వాస వరకు పనిచేసిన మహా నాయకుడు జగ్జీవన్ రామ్ అని వారు కొనియాడారు.