కొండపి: టంగుటూరు జాతీయ రహదారిపై మద్యం తాగి వాహనాలు నడిపిన ఒక్కొక్కరికి రూ. 10వేలు జరిమానా విధించిన సింగరాయకొండ కోర్టు
ప్రకాశం జిల్లా టంగుటూరు జాతీయ రహదారిపై మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురు వాహనదారులకు సోమవారం సింగరాయకొండ కోర్టు జరిమానా విధించింది. మద్యం తాగి వాహనం నడిపిన వాహనదారులను గుర్తించి పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు రూ.10 వేలు ఒక్కొక్కరికి జరిమానా విధించింది. నలుగురికి రూ.40వేలు జరిమానా విధించినట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.