కొండపి: సింగరాయకొండ మండలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం స్థానికంగా ఏర్పాటుచేసిన కూచిపూడి నృత్యం అందర్నీ విశేషంగా ఆకర్షించింది. చిన్నారులు సంప్రదాయ దుస్తులను కూచిపూడి నృత్యాన్ని చేశారు. జూలై 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు భారీగా తరలి వస్తుండడంతో తగు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.