కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో నిరాశ జనకంగా ముగిసిన పొగాకు వేలం, గిట్టుబాటు ధర కోసం వేడుకుంటున్న రైతులు
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో వ్యాపారుల తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. 2వ రౌండ్ కొనుగోలు ప్రారంభించినా తిరస్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. వెంకట కృష్ణాపురం, ముక్కోడి పాలెం, తాటాకులపాలెం గ్రామాలకు చెందిన రైతులు సోమవారం 316 బేళ్లు అమ్మకానికి తీసుకు రాగా 131 తిరస్కరించారు. గరిష్ఠ ధర రూ.250గా, కనిష్ఠ ధర రూ.200గా నిర్ణయించారు. తమకు నష్టాలేనని రైతులు వాపోయారు.