తాడిపత్రి: పెద్ద ఎక్కులూరులో అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో హాజరత్ హాజీవలి ఉరుసు ఉత్సవాలు
పెద్దపప్పూరు మండలం పెద్ద ఎక్కులూరు లో శుక్రవారం హజ్రత్ హాజీవలి ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా పూల చాందినీని గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. చుట్టుపక్కల మండలాల ప్రజలు ముఖ్యంగా ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూల చాందిని ఊరేగింపులో భాగస్వాములయ్యారు. హాజరత్ హాజీవ్ అలీ దర్గా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.