యర్రగొండపాలెం: చిన్న గుడిపాడు సమీపంలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొని తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీ కొట్టిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.