కొండపి: డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని మాజీ సీఎం జగన్ తిరుమల కు రాలేదు: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
తిరుమల వేంకటేశ్వర స్వామిపై ఉన్న విశ్వాసాన్ని వైసీపీ అపహాస్యం చేసిందని మంత్రి స్వామి ఆరోపించారు. తిరుమల ఆలయానికి జగన్మోహన్ రెడ్డి వస్తే డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి ఉంటుందని గుడికి రాకుండా ఆగిపోయిన ఘనత ఉందన్నారు. ఈడీ విచారణకు పిలిస్తే వెళ్లకుండా ఆగిన తమ నాయకుడి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి మాజీ సీఎం పై పలు విమర్శలు గుప్పించారు.