మార్కాపురం: మార్కాపురం మండలంలోని ప్రజలు పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఎమ్మార్వో చిరంజీవి
మార్కాపురం మండలంలోని పలు ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్వో చిరంజీవి సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద మొబైల్ టవర్స్ వద్ద విద్యుత్ స్తంభాల సమీపంలో పొలాలలో లేదా ఇతర బహిరంగ ప్రదేశాలలో ఉండరాదని తెలిపారు. తప్పనిసరిగా సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని కోరారు. రైతులు కూలీలు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.