యర్రగొండపాలెం: నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దుచేసి కార్మిక హక్కులను కాపాడాలి: సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయం వద్ద మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ... 140 సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పని దినం సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. నూతనంగా తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కార్మిక హక్కులను కాపాడాలని కోరారు