యర్రగొండపాలెం: దోర్నాల మండల కేంద్రంలో హోటల్ స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో ఉద్రిక్తత వాతావరణం
మార్కాపురం జిల్లా దోర్నాల మండల కేంద్రంలోని హరివిల్లు హోటల్ నిర్వహిస్తున్న స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో ఉద్రిక్తత నెలకొన్నది. స్థలం అప్పగించాలని యజమాని కోరడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు సర్ది జెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.