కొండపి: టంగుటూరు మండలం మర్లపాడు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడు గ్రామ సమీపంలో బుధవారం పేకాట ఆడుతున్న నలుగురిని స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.3,360 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని ఎస్ఐ హెచ్చరించారు. ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే 112 లేదా 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు.