మార్కాపురం: పొదిలి మండలంలో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు
మార్కాపురం జిల్లా పొదిలి మండలం గోగినేనివారిపాలెం గ్రామంలో పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.50,160 నగదు, 8 ద్విచక్ర వాహనాలు, 12 మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై సూరారెడ్డి రాజేష్ మీడియాకు తెలిపారు.