దర్శి: దర్శి పట్టణంలో డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
Darsi, Prakasam | May 18, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వైసిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ కార్యాలయం నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు స్వయంగా ఆయన ఆటోను తాళ్లతో కట్టుకొని లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. పెట్రోల్ డీజిల్ నిత్వసర వస్తువుల ధరలతో సామాన్యుడిపై పెను భారం మోపారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు.