మార్కాపురం: జిల్లా కేంద్రంలోని అల్లూరి పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దంపతులు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతంలో వెలిసిన అల్లూరి పోలేరమ్మ ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ అమ్మవారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.