తాడిపత్రి: వెంకటరెడ్డి పల్లి గ్రామ సమీపంలో డివైడర్ను ఢీకొన్న బైకు, వ్యక్తి మృతి పదం టీ తాగు ఒక్క నిమిషం
తాడిపత్రి మండలం వెంకటరెడ్డి పల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో యాడికి మండలం రాయల చెరువుకు చెందిన మోహన్ కుమార్ మృతి చెందాడు. మోహన్ కుమార్, మధుసూదన్ బైక్ లో వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నారు. మోహన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు.మొదట తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.