దర్శి: పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతు దీక్ష వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | Jul 14, 2026 ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పొగాకు రైతు దీక్ష వాల్ పోస్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల పక్షాన వైసీపీ పార్టీ జూలై 16, 17 వ తేదీల్లో పొగాకు రైతు దీక్ష చేపట్టినట్లు తెలిపారు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు ఎలాంటి మద్దతు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు.