మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో పెను ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన
మార్కాపురం జిల్లా కేంద్రంలో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధాన రహదారుల వెంట ఎక్కడబడితే అక్కడ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పెద్ద గాలి వీస్తే ఆ ఫ్లెక్సీలు రోడ్ల మీద వెళ్లే వాహనదారులపై పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని వారు వాపోయారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు