కనిగిరి: పట్టణంలో రూ.1.10 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న రైతు బజార్ ను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని తీగల గొందిలో రూ.1.10 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న రైతుబజార్ ను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటు రైతులకు, ఇటు వినియోగదారులకు లబ్ధి చేకూర్చేందుకు రైతు బజార్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అన్ని వసతులతో దాదాపు రైతు బజార్ నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు చే రైతు బజార్ ప్రారంభించడం జరుగుతుందన్నారు.