కనిగిరి: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు: కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి
కనిగిరి: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, చేయించుకున్నా వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 అమలు పై డివిజన్ స్థాయి మల్టీ మెంబర్ అధారిటీ సలహా కమిటీ సమావేశాన్ని ఆర్డిఓ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గర్భస్థ శిశువులను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆర్డిఓ ఆదేశించారు.