కనిగిరి: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.5 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ గఫార్
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉష పథకం కింద రూ.5 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపడుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పరిశీలించి, పనులు నాణ్యతగా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు మున్సిపల్ చైర్మన్ సూచించారు. పీఎం ఉష పథకం కింద డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేరి, వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.