కనిగిరి: హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం త్వరితగతిన అందించాలి: ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
చంద్రశేఖరపురం మండలంలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందకపోవడంతో, రైతులు సమస్యను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. బుధవారం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చంద్రశేఖరపురం తహసిల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ... గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు త్వరగా నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించవలసిన బాధ్యత రెవిన్యూ అధికారులపై ఉందన్నారు.