రాయదుర్గం: రాయదుర్గంలో అధనపు జెఎఫ్ఎం కోర్టు సేవలు ప్రారంభం
రాయదుర్గంలో అధనపు జూనియర్ సివిల్ జడ్జి జెఎఫ్ఎం కోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయి. బుధవారం వర్చువల్ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్ ఈ కోర్టును ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి ఎన్.రమ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతరెడ్డి పాల్గొన్నారు. అధనపు కోర్టు సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ను రాయదుర్గానికి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పృథ్విరాజ్ సహాయ కార్యదర్శి కుళ్ళాయప్ప, కోశాధికారి రేణుక, లైబ్రేరియన్ రమ్య పాల్గొన్నారు.