కొండపి: కొండపి పట్టణంలో ట్రాఫిక్ సమస్య, పరిష్కరించేందుకు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్
ప్రకాశం జిల్లా కొండపి ఆర్టీసీ బస్టాండ్ నుంచి అనకర్లపూడి వైపు వెళ్లే మార్గంలో బీసీ హాస్టల్ వరకు రోజూ ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. ఉదయం, సాయంత్రం ఇరువైపులా భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి. సైడ్ కాలువల పనులతో వాహనాలు సరిగా పోలేకపోతున్నాయి. ట్రాఫిక్లో తరచూ స్వల్ప ఘర్షణలు జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం ఓ కానిస్టేబుల్ సాయంతో ట్రాఫిక్ నియంత్రించగలిగితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు చెబుతున్నారు.