రాయదుర్గం: గొల్లపల్లి గ్రామంలో యువ రైతు అకాల మృతికి మెట్టు గోవిందరెడ్డి సంతాపం
గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామంలో యువ రైతు రంజిత్ రెడ్డి విద్యుత్ ప్రమాదంలో మృతిచెందడం అత్యంత బాధాకరమని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి అన్నారు. ఆ పార్టీ గుమ్మగట్ట మండల కన్వీనర్ గౌని లక్ష్మీకాంత్ రెడ్డి సోదరుడు సత్యనారాయణ రెడ్డి కుమారుడు రంజిత్ శుక్రవారం అకాల మరణంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపల్లి గ్రామానికి వెళ్లి మృతుడి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెట్టు గోవిందరెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు నివాళులర్పించారు.