మార్కాపురం: జిల్లాలో జూన్ 9వ తేదీ నుండి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ దేవాలయ ప్రాంగణం, జిల్లా కేంద్రాలలో యోగాంధ్ర -2026 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. జూన్ 9వ తేదీ కంభం చెరువు కట్ట పైన, 13వ తేదీ జిల్లా కేంద్రంలో, 17వ తేదీ త్రిపురాంతకం దేవాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు యువత మహిళాలు పాల్గొన్నారు.