విశాఖపట్నం: 34వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచార ర్యాలీ
జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో 34వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థుల ప్రచార ర్యాలీ నిర్వహించారు. మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణి, కార్పొరేటర్ అభ్యర్థి జెర్రిపోతుల ప్రసాద్‌లకు మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.