రాయదుర్గం: గుమ్మగట్ట వద్ద రెండు బైక్ లు డీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
గుమ్మగట్ట వద్ద మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం వేపులపర్తి కి చెందిన కాంతయ్య బైక్‌పై వెళుతుండగా, గోనబావికి చెందిన జితేంద్ర మరో వ్యక్తితో కలిసి ఎదురుగా బైక్‌పై వస్తుండగా రెండు బైక్‌లు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాంతయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు రిఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.