యర్రగొండపాలెం: డీఎస్సీలో అవకతవకలు జరిగాయని సిబిఐకి అప్పజెప్పాలని వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ కు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఎస్సీలో జరిగిన అవకతలపై చర్యలు తీసుకోవాలని సిబిఐకి అప్పజెప్పాలని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని విమర్శించారు. ప్రతిభావంతులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పనంగా వారికి అనుకూలమైన వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ జరగాలని డిమాండ్ చేశారు.