కొండపి: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం లోని మంత్రి కార్యాలయంలో చెత్త సేకరించే రిక్షాలను ప్రారంభించిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం చెత్త సేకరించే రిక్షాలను స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి స్వామి ప్రారంభించారు. అలానే చెత్త సేకరించి డస్ట్ బిన్నులు కూడా అందజేశారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా పారిశుద్ధ కార్మికులకు అందించాలన్నారు. దానితో వారు ఆ చెత్తను తీసుకువెళ్లి చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలలో అందిస్తారని అన్నారు.