సంతనూతలపాడు: సంతనూతలపాడు లో ప్రమాదవశాత్తు మోటార్ బైక్ దగ్ధం, మోటర్ బైక్ పై ఉన్న వ్యక్తికి తప్పిన ప్రమాదం
సంతనూతలపాడు: ప్రమాదవశాత్తు మోటర్ బైక్ దగ్ధం అయిన సంఘటన సంతనూతలపాడు లోని చెరువు కట్ట వద్ద వాటర్ ప్లాంట్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంతనూతలపాడులో మోటర్ బైక్ పై గాంధీ అనే వ్యక్తి పాల ప్యాకెట్లు తీసుకుని వెళుతున్న క్రమంలో మోటర్ బైక్ బాగా వేడెక్కడంతో బైక్ ను నిలిపి వేశాడు. ఈ క్రమంలో బైక్ పై నుండి పొగలు రావడం, చూస్తుండగానే బైక్ దగ్ధం కావడం జరిగిపోయింది. అయితే బైక్ పై ఉన్న వ్యక్తి సురక్షితంగా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు.